
Odela: ఓదెలలో కోర్టు ఏర్పాటు ఎప్పుడో..?
సిరాన్యూస్, ఓదెల ఓదెలలో కోర్టు ఏర్పాటు ఎప్పుడో..? * హైకోర్టు సిఫారసు చేసినా అమలుకాని వైనం * ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న ప్రజలు ప్రజలకి న్యాయం అందించే న్యాయస్థానానికే న్యాయం జరగడం లేదు. న్యాయం మన ముందుకు వచ్చిందని సంబరపడిన ఓదెల , శ్రీరాంపూర్ మండల ప్రజలకు నిరీక్షణ మాత్రమే మిగిలింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం పెద్దపల్లి జిల్లా ఓదెలలో కోర్టు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినా స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు.కోర్టు ఏర్పాటుకి ఆమోదం పొంది ఆరు నెలలైనా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. న్యాయమూర్తి కొలువుదీరి కేసులు పరిష్కరించలేదు. న్యాయం కోసం కక్షిదారులు రహదారులు, రవాణా సౌకర్యాలు అనుకూలంగా లేక, సుల్తానాబాద్ కోర్టు వరకు వెళ్లడానికి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పైగా సుల్తానాబాద్ కోర్టు…
