Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 November 2024, 5:45 pmEditor : SIRA NEWS

Odela ZPHS: ఓదెల జ‌డ్పీహెచ్ఎస్ పాఠ‌శాల‌లో ఘనంగా బాలల దినోత్సవం

సిరాన్యూస్, ఓదెల
ఓదెల జ‌డ్పీహెచ్ఎస్ పాఠ‌శాల‌లో ఘనంగా బాలల దినోత్సవం

ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల జ‌డ్పీహెచ్ఎస్ పాఠ‌శాల‌లో గురువారం ఘనంగా బాలల దినోత్సవం వి. పద్మ ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నవభారత నిర్మాత పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ కి బాలలంటే చాలా ఇష్టమ‌ని తెలిపారు. నేటి బాలలే రేపటి జాతి నిర్మాతలు అని అనేవారన్నారు. ఆయన పుట్టినరోజు బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు.అనంత‌రం యంగ్ ఆరేటర్స్ క్లబ్ వారిచే స్కిట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆంగ్లంలోనిర్వహించారు. అనంతరం గత సంవత్సరం నుండి పాఠశాలలో జరిగే విద్యా కార్యక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ఐ ఎఫ్ బి ద్వారా వీడియోలు చూపించారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యా కార్యక్రమాలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలను ఉత్సాహంగా తిలికించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ టీచర్ బి శోభారాణి , జానీను సన్మానించారు. అందరి విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడడం చూసి తల్లిదండ్రులు సంతోషించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.