
అంగన్వాడీలపై కక్ష కట్టిన జగన్ రెడ్డి
టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తాం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిరా న్యూస్,విజయవాడ; అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోగా నిరసలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ రెడ్డి అధికారమదానికి నిదర్శనమ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరోపించారు. ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతమిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదు? పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెంచకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలో కోత పెట్టావ్. నువ్వు జీతాలు పెంచక, సంక్షేమం అందించక అంగన్వాడీలు ఎలా బతకాలి జగన్ రెడ్డీ? ఇదేనా రాజన్న పాలనంటే? చంద్రబాబు గారు రూ. 4,200గా ఉన్న అంగన్వాడీల జీతాన్ని రూ. 10,500 పెంచితే జగన్ రెడ్డి వారిని మోసం…
