
గ్రూప్ 2 మళ్లీ వాయిదా..?
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ తొలుత భావించింది. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర వివరాల మేరకు కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.గ్రూప్-2లో…
