తాజా వార్తలు

ఆపరేషపన్ చిరుత సక్సెస్

సిరా న్యూస్,హైదరాబాద్; ఐదు రోజుల క్రితం హఐదరాబాద్ శివారు శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు రాత్రి బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం జరుగుతుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా భయాందోళనలకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వేపై చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు ఎయిర్ పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం వేట మొదలుపెట్టారు.అనుమానిత చిరుత సంచార ప్రాంతాలను గుర్తించిన అధికారులు, ప్రత్యేకించి ఇరవై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా ఉంచారు. ఒకానొక దశలో చిరుత బోను వరకూ వచ్చి వెనకి…

Read More
3 May 2024, 5:08 pmsiranews.in