
అధికారుల్లో దడ…….
సిరా న్యూస్,నెల్లూరు; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దడ లేపుతున్నారు. ఆయన పర్యటనలు అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో అన్న టెన్షన్ అధికారుల్లో ఉంది. 2014 లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు అసలు పొంతనే లేదు. పూర్తిగా వయొలెంట్ గా మారిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 1995 నాటి ముఖ్యమంత్రిని నేడు చూస్తారంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. బీకేర్‌ఫుల్ అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలంటూ చంద్రబాబు అంటుండటంతో వణికిపోతున్నారుచంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడు ఆయన దూకుడుగా వెళ్లారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారులను నిద్ర పోనివ్వ లేదు. దీంతో పాటు సస్పెన్షన్లు కూడా నాడు ఎక్కువ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన నాడు చెబుతూ వైద్యం,…
