ఆంధ్రప్రదేశ్

పవన్ మార్క్… పాలనా…

సిరా న్యూస్,కాకినాడ; జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తుంది. గత నెల 12వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తీరును గమనించిన వాళ్లు ఎవరైనా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ, అంతకు ముందు కూడా ఆయన పూర్తిగా సంయమనం పాటిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా పవన్ కల్యాణ‌్ ఎక్కువ మాట్లాడటం లేదు. పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూసిన వారికి ఎన్నికలకు ముందు, తర్వాత ఇంత మార్పేమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ‌్ ఊగిపోయేవారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే వారు. చెప్పులు చూపించారు. కొన్ని వాడకూడని పదాలను కూడా వాడారు. ఆయన జనంలో ఎక్కువగా ఇమడలేనట్లుగా కనిపించారు. ఆవేశంతో…

Read More
6 Jul 2024, 10:49 amsiranews.in