
pawa go to delhi : ఢిల్లీకి పవన్….
సిరా న్యూస్,విజయవాడ; ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఓ వైపు చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు జనసేన తరపున నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్న విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాకకు సుందరపు సతీష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్‌లను నియమించారు. అధికారికంగా అభ్యర్థులని కాకుండా 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు.గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు రెండు…
