
Payal Shankar: నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
సిరా న్యూస్, జైనథ్ నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ * బీజేపీలో చేరిన గూడ గ్రామ యువకులు మరోసారి నరేంద్రమోడీని ప్రధానిని చేద్దామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గూడా గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ పాలన తీరును, ఆయన సాధించిన విజయాలను, ప్రజల కోసం చేసిన మంచిని ఆయన వివరించారు. కరోనాకాలంలో ఈ విధంగా నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకొని దేశాన్ని పెద్ద విపత్తు నుండి బయటకు తీసుకువచ్చారని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు ఆరువేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
