తాజా వార్తలు

Payal Shankar: ఉన్నత స్థాయికి ఎదగాలి:  ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ ఉన్నత స్థాయికి ఎదగాలి:  ఎమ్మెల్యే పాయల్ శంకర్ *  బీసీ వసతి గృహాన్ని సంద‌ర్శ‌న‌ * విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహాల్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. చిన్నప్పుడు తాను హాస్టల్లో విద్యార్థుల కష్టాలు స్వయంగా చూశానని, ఇప్పుడు పరిస్థితులు మారినందున వసతి గృహాల వైపు దృష్టి సారిస్తున్నారని అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని బీసీ బాలుర వసతి గృహాన్నిఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసంద‌ర్బంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. నోట్ బుక్కులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారా లేదా అని…

Read More
2 Jul 2024, 11:34 amsiranews.in