తెలంగాణ

Payal Shankar: బాబు జగ్జీవన్ రాం మ‌ర‌వ‌లేనివి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ బాబు జగ్జీవన్ రాం మ‌ర‌వ‌లేనివి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘ‌నంగా బాబు జగ్జీవన్ రాం వ‌ర్దంతి స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బాబు జగ్జీవన్ రాం వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రాం చౌరస్తా లోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమాజ శ్రేయస్సు కోసం పాటు పడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. సుమారు యాభై సంవత్సరాలు దేశం కోసం పని చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మహనీయుల జయంతిలను, వర్ధింతులను జరుపుకోవడం కాకుండా వారి ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. గత ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.…

Read More
6 Jul 2024, 1:59 pmsiranews.in