సిరాన్యూస్, ఆదిలాబాద్
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు గురుకుల పాఠశాల విద్యార్థినుల ఎంపిక: పీడీజీ నాందేవ్
జోనల్ స్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు సోమవారం లక్షట్ పేట లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగాయి. అందులో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన నలుగురు అమ్మాయిలు ఆర్. అనూష , పదవ తరగతి, శిరీష 9వ తరగతి భవిష్య, శ్రీలత ఏడవ తరగతి లు పాల్గొనగా అందులో ముగ్గురు అమ్మాయిలు రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్, పి.డి జి. నాందేవ్ పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. కాగా ఈనెల 3 నుండి 5వ తేదీ వరకు నారాయణపేటలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో ఈ ముగ్గురు అమ్మాయిలు పాల్గొననున్నట్లు పీడీజీ నాందేవ్ తెలిపారు.