
భద్రతా మండలిలో శాశ్వత భారత్.. ఇక లాంఛనమే
సిరా న్యూస్; ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈమేరకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో భారత్ జరుపుతున్న సంప్రదింపులు.. గడిచిన పదేళ్లలో భారత్ సాధించిన ఆర్థిక ప్రగతి చూసి.. అనేక దేశాలు భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇటీవలే అమెరికా కూడా భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపింది. తర్వాత ఫ్రాన్స్, తాజాగా యూకే కూడా భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసపెంబ్లీ 79వ సాధారణ చర్చను ఉద్దేశించి మాట్లాడిన బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ యూఎన్‌సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలన్నారు. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతోందని…
