
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలంపై వివాదం హైకోర్టులో పిటిషన్
సిరా న్యూస్,హైదరాబాద్; తన ఇంటి స్థలంపై వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్టప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనాఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్సఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన డీఆర్టీ.. బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాంకుల నోటీసులను సవాల్…
