
పీకే.. సర్వేలతోనే సరా…
సిరా న్యూస్,పాట్నా; ప్రశాంత్ కిషోర్! భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ పార్టీలను అధికారాన్ని అందించిన వ్యక్తి. 2011లో నరేంద్ర మోదీకి మద్దతుగా మొదలైనా ప్రస్థానం... పుష్కర కాలంలో ఆయనకు సెలబ్రిటీ స్థాయిని అందించింది. పీకే అని పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బిహార్. ఆయన మద్దతుతో 2014 నాటికి మోదీ జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. పీకే తన ఐప్యాక్ అనే టీం ద్వారా సర్వేలు నిర్వహిస్తారు. ప్రజలకు ఏం కావాలో పార్టీలకు చెబుతుంటారు. గెలవడానికి వ్యూహాలు పన్నుతుంటారు. పార్టీల విజయావకాశాలను మెరుగుపరుస్తారు.భాజపాతో పాటు జేడీ(యు), ఆప్, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు కూడా వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ఘన విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ దేశం దృష్టిని ఆకర్షించారు. నాటి నుంచి పార్టీలన్నీ ఆయనను…
