
Pipparwada Toll Plaza: పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా ఉద్యోగులు ఉంటారా? ఊడుతారా?
సిరా న్యూస్, డిజిటల్: పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా ఉద్యోగులు ఉంటారా? ఊడుతారా? + డైలమాలో 75మంది ఉద్యోగుల జీతాలు + అధికారం మారడంతో అందరిలో హైరానా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఉంటాయా? ఊడుతాయా? అంటూ మండలవాసుల్లో ఓ కొత్త చర్చ మొదలైంది. ఈ టోల్‌పాజాలో 6 గురు సూపర్‌వైజర్లు, 53మంది టోల్ కలెక్షన్ సిబ్బంది, మరో 6గురు కింది స్థాయి సిబ్బంది కలిపి మొత్తం 75మంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ టెండర్లు మారిన, కాంట్రాక్టర్లు మారిన ఈ ఉద్యోగులు మాత్రం పర్మినెంట్‌గా ఇక్కడే పనిచేయడం జర్గుతుంది. అయితే 15సంవత్సరాల తరువాత ఆదిలాబాద్ నియోజక వర్గంలో అధికారం మారింది. బీఆర్‌ఎస్‌కు చెందిన జోగు రామన్న ఎమ్మెల్యేగా ఓడిపోయి బీజేపీ నుంచి పాయల్ శంకర్ గెలుపొందారు. సుధీర్ఘ కాలం…
