
Poetry competition with Gandhi… . గాంధీలతో కవిత పోటీనా..
సిరా న్యూస్,మెదక్; తెలంగాణ గడ్డపై తొలిసారిగా జెండా ఎగరవేసిన కాంగ్రెస్… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే దూకుడును ప్రదర్శించాలని చూస్తోంది. మెజార్టీ సీట్లను గెలుచుకోని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేయటమే కాకుండా… ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం తీర్మానం కూడా చేసింది. ఈ పరిణామం కాస్త రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం తరపున ఎవరో ఒకరు పోటీ చేస్తారనే వాదన రోజురోజుకూ బలపడుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే… ఇటీవలే జరిగిన టీపీసీసీ సమీక్షలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయటం ఇందుకు బలం చేకూర్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్…. పార్లమెంట్ ఎన్నికలపై అలర్ట్ అయ్యే ప్రయత్నాలను మొదలుపెట్టింది. నేతలతో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే…
