ఆంధ్రప్రదేశ్

పోలవరం ఫైల్స్ దగ్ధం కేసు

నలుగురు ఉద్యోగులు సస్పెండ్  సిరా న్యూస్,ఏలూరు; అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దగ్దం తరువాత తూర్పుగోదావరి జిల్లాలోనే అలాంటి సీన్ రిపీట్ అయింది. టీటీడీలోనూ కొన్ని ఫైళ్లు కాలిపోయిన ఘటన సైతం సంచలనంగా మారింది. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం కేసులో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబీలతో పాటు స్పెషల్‌ ఆర్‌ఐ కళాజ్యోతి, సబార్డినేట్‌ రాజశేఖర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సస్పెండ్‌ చేశారు. దాంతోపాటుగా డిప్యూటీ తహసీల్దార్లు ఎ. సత్యదేవి, ఎ. కుమారిలకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు.…

Read More
19 Aug 2024, 11:38 amsiranews.in