
ఏపీలో పొలిటికల్ తీన్మార్…
సిరా న్యూస్,విజయవాడ; జనవరి 25 ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రా కదలిరా రెండో షెడ్యూల్ రెడీ చేసుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. నెలాఖరులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలంతా పర్యటనల షెడ్యూళ్లు ఫిక్స్ చేసుకున్నారు. వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై దృష్టి పెట్టారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులను…
