తాజా వార్తలు

స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను 'స్కిల్ యూనివర్సిటీ' పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన విధివిధానాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాల మేరకు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. సిలబస్ అప్‌గ్రేడ్ చేసేందుకు నిపుణుల కమిటీ నియమించి, సూచనలు సలహాలు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే నైపుణ్య యూనివర్సిటీ సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్మికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ వీసీగా…

Read More
23 Sep 2024, 12:00 pmsiranews.in