Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 2 April 2024, 5:12 pmEditor : SIRA NEWS

Ponnam Prabhakar: తెలంగాణ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సిరాన్యూస్‌, సైదాపూర్
తెలంగాణ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
* మంత్రి పొన్నం ప్రభాకర్
* ఘ‌నంగా నివాళి..

తెలంగాణ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర రవాణా& శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి రాష్ట్ర రవాణా, శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలై దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మొగలాయిలకు వ్యతిరేకంగా బహుజన ఉద్యమం ఉవ్వెత్తున ఎగరేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.