
Ponnam Prabhakar: తెలంగాణ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
సిరాన్యూస్, సైదాపూర్ తెలంగాణ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ * మంత్రి పొన్నం ప్రభాకర్ * ఘనంగా నివాళి.. తెలంగాణ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర రవాణా& శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి రాష్ట్ర రవాణా, శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ తొలి రాజు బహుజన…
