
Ponnam Prabhakar: రేపు ముత్తారం త్రికూటేశ్వర ఆలయానికి మంత్రి పొన్నం రాక
సిరా న్యూస్, భీమదేవరపల్లి రేపు ముత్తారం త్రికూటేశ్వర ఆలయానికి మంత్రి పొన్నం రాక కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ కట్టడం ముత్తారం త్రికూటేశ్వర ఆలయంలో శుక్రవారం నిర్వహించే మహాశివరాత్రి జాతర వేడుకలకు బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో శిథిలావస్థలో ఉన్న సమయంలో మాజీ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ మొదటిసారిగా ఆలయ దర్శనానికి వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఆలయ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని మాట ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ముత్తారం త్రికుటేశ్వర ఆలయానికి రావడం పట్ల భక్తులు, ఆలయ నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి మంత్రిగా సహకారం అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వామి కావాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు
