
కేకేకు పిలిచి పదవులు…
సిరా న్యూస్,హైదరాబాద్; రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు.. తొలుత జర్నలిస్టు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం సాగింది. పలు పదవులు అప్పుడు కూడా పొందారు. సామాజికవర్గం కోణంలో ఆయనకు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ పదవులు దక్కుతూ వచ్చాయి. అదృష్టం అలా అంటి పెట్టుకుని ఉండటంతో ఆయన ఏదో ఒకపదవిలో కొనసాగుతూనే వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కేశవరావు స్వతహాగా జర్నలిస్ట్ కావడంతో జనం పల్స్ ముందుగానే అంచనా వేసుకని నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కూడా కేకేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. పదేళ్ల పాటు టీఆర్ఎస్ లో ఉన్న కె. కేశవరావు రెండు సార్లు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. మ్యానిఫేస్టో కమిటీ నుంచి…
