
వైయస్సార్సీపి జిల్లా అనుబంధ విభాగాలలో తుగ్గలి మండల నాయకులకు పదవులు
సిరా న్యూస్,తుగ్గలి; వైఎస్ఆర్సిపి జిల్లా అనుబంధ విభాగాలలో తుగ్గలి మండలానికి చెందిన నాయకులకు జిల్లా స్థాయిలో పదవులను కేటాయిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో మండల కేంద్రమైన తుగ్గలి కు చెందిన మోహన్ రెడ్డి కు వైఎస్ఆర్సిపి జిల్లా కమిటీలో కార్యవర్గ సభ్యులతో పాటు వైకాపా సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా,కడమకుంట్ల గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి కు వైకాపా యూత్ జిల్లా ఉపాధ్యక్షులుగా,ఎర్రగుడి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జిట్టా లక్ష్మీదేవి కు,రాంపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గంగాధర్ కు వైకాపా బిసి సెల్ జిల్లా కార్యదర్శులుగా,తుగ్గలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పురుషోత్తం కు వైకాపా ఎస్సీ సెల్ కార్యదర్శిగా,మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్ ఎస్టీ సెల్ వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా,బోడబండ…
