Prajapalana Applications in Venu nagar: వేణు నగర్ లో ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణ…

సిరా న్యూస్, పెంబి:

వేణు నగర్ లో ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణ…

నిర్మల్ జిల్లా పెంబి మండలం లోని వేణు నగర్ లో ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ మేరకు అధికారులు దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో మొత్తం 56 కుటుంబాలు ఉండగా 63 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపిడిఓ సుధాకర్, ఎంపీ ఓ రత్నాకర్, ఎంపీపీ భూక్యా కవిత గోవింద్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, జడ్పిటిసి జాను భాయ్, ఎస్సై రజినీకాంత్, సర్పంచ్ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *