
సోనియా కోసం మెదక్ సిద్ధం
సిరా న్యూస్,మెదక్; అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. ఈమేరకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల్లో గెలిచేందుకు ఏకంగా పార్టీ జాతీయ నాయకురాలిని రంగంలోకి దింపాలని తీర్మానం చేశారు. ఎమర్జెనీలో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణ భారత దేశమే పూర్వ వైభవం తెచ్చింది. ఇందిరాగాంధీ మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. ఇందిరా రెండోసారి ప్రధాని అయ్యారు. ఇక తాజాగా పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన పార్టీని తిరిగి ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈసారి కూడా దక్షిణ భారత దేశం నుంచే బరిలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్రనేత సోనియాగాంధీని రంగంలోకి దించే ఎత్తుగడ వేస్తోంది,క్రికెట్లో…
