Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 September 2024, 3:53 pmEditor : Sira News

ఏసీబీ వలలో విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్

సిరా న్యూస్,హైదరాబాద్;
కొత్తపేట లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏసీబీ రైడ్స్ జరిపింది. ఫుడ్ కాంట్రాక్టుకు సంబంధించి 29,000/- రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ విఎం హోమ్ ప్రిన్సిపాల్ ప్రభు దాస్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. స్కూల్ కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్టు విషయం లో అవకతవకల పై పలు ఫిర్యాదులు రావడం తో విఎం హోమ్ స్కూల్ పై నిఘా ఏర్పాటు చేసారు ఏసీబీ అధికారులు. విఎం ఈ నేపధ్యంలో ఏసీబీ అధికారులు విఎం హోమ్ లో సోదాలు నిర్వహించారు. ఫుడ్ కాంట్రాక్టు బిల్లు కు సంబంధించి వాస్తవ బిల్లులు కన్న అధిక బిల్లులు సృష్టించి, అధిక మొత్తం బిల్లులకు సంబంధించిన డబ్బులు 29,000/- వేలు కాంట్రాక్టర్ వద్ద నుండి తిరిగి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప్రిన్సిపాల్ ప్రభు దాస్ దొరికిపోయాడు. ప్రభుదాస్ ను అదుపులోకి తీసుకుని సంబంధించిన వివరాల పై ప్రిన్సిపల్ ను ప్రశ్నిస్తున్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.