
పార్టీలు మారితే…ఇంటి ముందు ధర్నాలు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ దంగల్ ముగిసింది.. 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో టీజేఎస్ చీఫ్.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి ఉందంటూ కోదండరామ్ పేర్కొన్నారు. గెలిచిన నేతలు పార్టీలు మారకుండా చూడాలంటూ అభిప్రాయపడ్డారు. పార్టీలు మారితే వాళ్ల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామంటూ హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను.. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ కోదండరాం సూచించారు. కృష్ణా నీటి వివాదంతో ప్రయోజనం పొందాలని చూశారని.. అది భగ్నమైందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దౌర్జన్యం, దోపిడిపై తిరుగుబాటే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అంటూ వివరించారు. ఎగ్జిట్ పోల్స్ చూపినట్టే డిసెంబర్ 3న ఈ అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతారంటూ జోస్యం చెప్పారు.ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా…
