Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 February 2024, 3:55 pmEditor : Sira News

రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో జూనియర్ మెడికో స్టూడెంట్ ను సీనియర్లు కొందరు ర్యాగింగ్ చేయడం కలకలం సృష్టించింది. ఈ సంఘటనపై హాస్టల్లో గొడవ జరగడంతో పోలీసులు వెళ్లి విచారణ జరిపారు. జూనియర్ మెడికో తల వెంట్రుకలు, మీసాలను ట్రిమ్మర్ తో ఇష్టానుసారంగా కట్ చేసి, ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. దీనిపై సదరు స్టూడెంట్ కుటుంబ సభ్యులు కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అయితే కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మేడికో విద్యార్థులు, పోలీసుల మధ్య రహస్యంగా మీటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు జూనియర్ విద్యార్థులు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు, విచారణ అనంతరం రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ అంటున్నారు. కాగా ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.