
Rahul:రాంజీ గోండు ఆశయ సాధన కోసం కృషి చేయాలిః టిఎస్ఎఫ్ అధ్యక్షులు బి రాహుల్
సిరాన్యూస్, ఆదిలాబాద్ రాంజీ గోండు ఆశయ సాధన కోసం కృషి చేయాలిః టిఎస్ఎఫ్ అధ్యక్షులు బి రాహుల్ * రాంజీ గోండ్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు రాంజీ గోండు ఆశయ సాధన కోసం కృషి చేయాలని టిఎస్ఎఫ్ అధ్యక్షులు బి రాహుల్ అన్నారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టూడెంట్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో రాంజీ గోండు 164 వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా రాంజీ గొండ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం, ఆదివాసి హక్కుల కోసం పోరాటం చేసిన ఆదివాసి వీరుడు రాంజీ గోండు అని అన్నారు. ఆదివాసుల అభ్యున్నతికి రాంజీ గోండు చేసిన సేవలు ఎప్పుడు మర్చిపోలేనివి అని అన్నారు. రాంజీ గోండు ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.…
