
రైల్వే జోన్…వ్యవహారం… తప్పెవరిది…
సిరా న్యూస్,విశాఖపట్టణం; విశాఖ రైల్వే జోన్ జాప్యంపై కేంద్రరాష్ట్రాల ప్రభుత్వాలు చెరో మాట చెబుతున్నాయి. రైల్వే జోన్ లేట్ అవడానికి కారణం రాష్ట్రప్రభుత్వమని అటు కేంద్రం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే జోన్ ఆలస్యం అవుతుందని పార్లమెంట్ సాక్షిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో కేంద్రప్రభుత్వం తీరుతోనే రైల్వే జోన్ ఆలస్యమవుతోందని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. భూమి ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. క్లియర్ లైటిల్తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా రెడీగా ఉందన్నారు. రైల్వే శాఖకు లేఖ రాస్తే అటువైపు స్పందన రాలేదని కలెక్టర్ తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఎప్పుడు ముందుకు వస్తే అప్పుడు భూమిని అప్పగిస్తామని…
