
అందుబాటులోకి రాజమార్గ్ యాత్ర… యాప్
సిరా న్యూస్,న్యూఢిల్లీ; సాధారణంగా మనం ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లేటప్పుడు.. రూట్ కోసం గూగుల్ మ్యాప్ ఉపయోగిస్తుంటాం. అయితే.. ఒక్కోసారి అది కూడా సరైన దారి చూపకపోవచ్చు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ ఏమిటి? ఫీచర్లు ఏమిటి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. హైవే యాత్ర యాప్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చే అభివృద్ధి చేయబడిన ఒక ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్. ఈ యాప్ జాతీయ రహదారులపై ప్రయాణించే వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో “రాజ్మార్గ్ యాత్ర” పేరుతో ఈ యాప్ను ప్రారంభించింది. ‘సిటిజన్-సెంట్రిక్ యూనిఫైడ్…
