
Rajendra Vijay: పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్
సిరాన్యూస్, ఆదిలాబాద్ పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆదిలాబాద్ జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియ సజావుగా , సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్సర్వర్లను నియమించడం జరిగిందని తెలిపారు. మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల దారులు, మాక్ పోల్ తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియ నిబంధనల కనుగుణంగా, పూర్తి పారదర్శకంగా…
