తెలంగాణ

Rajura satyam:డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

సిరాన్యూస్‌, ఖానాపూర్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ చివరులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ను బుధ‌వారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో స్వీకరించిన చెత్తా,చెదారం డంపింగ్ యార్డ్ లో వేసిన తర్వాత చెత్త నుండి ప్లాస్టిక్, డబ్బాలు, కవర్లను, ఇనుప, వస్తువులను వట్టాలను రోజు రోజు వేరుచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆదాయం అందించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
13 Mar 2024, 6:29 pm
Updated: 13 Mar 2024, 6:29 pm
siranews.in