
గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శమూర్తి రమాబాయి అంబెడ్కర్
సిరా న్యూస్; -నేడు ఆమె జయంతి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ సతీమణి రమాబాయి అంబెడ్కర్. ఈమె ఫిబ్రవరి 7న,1898 లో జన్మించింది. మాత రమాబాయి ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది దేశానికే దీపమయ్యారు. రమాభాయి బాబా సాహెబ్ ను గుర్తించినంతగా తన స్వంత జాతి ప్రజలు బాబా సాహెబ్ విజయాలకు కారణమైన రామబాయిని గుర్తించలేదనే చెప్పాలి. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ ని ఒక మేను పర్వతంగా తాను నిలబెట్టింది. డాక్టర్ అంబేద్కర్ గారి ఒకొక్క మెట్టు వెనుక రమాబాయి అమ్మ పంటి బిగువున బిగపట్టిన బాధ తాలూకు గాయలున్నాయి. బాబా సాహెబ్ ఇదంతా గుర్తించారు. ఆమెకు గుర్తుగా 1941 ఆయన వ్రాసిన 'థాట్స్ ఆన్ పాకిస్తాన్' పుస్తకాన్ని అంకితమిచ్చారు. అతి తొందరగా "నా "అనుకునే వారిని పోగొట్టుకున్న రమాబాయితో బాబా…
