
ఇంటింటికి రామయ్య ఫోటోలు
సిరా న్యూస్,కరీంనగర్; అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరిన వేళ అందరి అడుగులు రామయ్య దర్శనం కోసమే అన్నచందంగా ఉంది. తాజాగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అయోధ్య రాముడు ప్రతి ఇంటా కొలువుదీరబోతున్నడు. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర ప్రాణ:ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణలో ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికులు అయోధ్య వెళ్లాలని, శ్రీరామ చంద్రుడిని దర్శించాలని ఆశిస్తున్న వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో రాములోరి ప్రతి భక్తుడి ఇంటికి అయోధ్య రామయ్య రాబోతున్నడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇంటింటా కొలువు దీరేలా అయోధ్య రామయ్య చిత్రపటాలను తయారు చేయించారు. అందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? అందులో అయోధ్య రామయ్యను తలిచి కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు.కరీంనగర్…
