
తిరుమలలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం
సిరా న్యూస్,తిరుమల; ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిర్ణయాలను వేగంగా అమలు చేస్తోంది. అటు వైసీపీ సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం పునః సమీక్షిస్తోంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కడ నుంచే చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు ఉన్న శ్యామలరావును ఈవోగా నియమించారు. దీంతో ఆయన భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఐదేళ్లుగా జరిగిన అవకతవకలపై సైతం ఫోకస్ పెట్టారు. వైసిపి మంత్రుల సిఫారసు లేఖలతో భారీగా విఐపి బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు తాజాగా వెలుగు చూస్తుండడం విశేషం.సాధారణంగా తిరుపతిలో వివిఐపి దర్శనాలకు ప్రత్యేక అవకాశం ఇస్తారు. ముఖ్యంగా మంత్రుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,…
