
ప్రతి భారతీయుడికి స్ఫూర్తి రతన్ టాటా జీవితం
సిరా న్యూస్; -నేడు ఆయన పుట్టిన రోజు పది వేల కోట్ల రూపాయలుగా ఉండవలిసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడు ఒకే ఒక్కడు తన యుక్తి తో,తన వ్యాపార నిపుణతతో ఆరు లక్షల కోట్లకు ఎగబాకేలా చేసాడు. దాదాపు ఏడు లక్షల మందికి ఉపాధినిస్తూ,నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ను అందనంత ఎత్తులో నిలబడేలా చేసాడు. నేడు ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రక్కుల వరకు ఇలా ప్రతి వ్యాపారంలో లోను ఖచ్చితంగా టాటా పేరు వినిపిస్తుంది.ఇంతటి ఘన చరిత్రను టాటా గ్రూప్ కు కట్టబెట్టేలా చేసాడు అతను. అతనే రతన్ టాటా. కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శప్రాయడు ఈ జీవన విజేత. రతన్ టాటా గురించి చూసుకుందాం:1937 డిసెంబర్ 28 న దేశంలోనే ధనిక కుటుంబంలో జన్మించాడు…
