రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు.

-సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
సిరా న్యూస్,జగిత్యాల ;
రతన్ టాటా మరణం మన భారత దేశానికి తీరని లోటు అని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభ జరిపి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు రతన్ టాటా పెట్టింది పేరని,విద్య,వైద్యం,పారిశుధ్యం,జంతు సంక్షేమం వంటి రంగాల్లో వారి దాతృత్వం మరువలేనిదన్నారు.అందులో ముఖ్యమైనది కరోనా కష్టకాలంలో దేశంలో కరోనా నుంచి ప్రజలు కొలుకోవడానికి రూ.15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వంకు అందించారని,సమాజాభివృద్ధి దిశగా చేసిన ఆ మహనీయుని జీవన ప్రయాణం …భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తునే ఉంటుందని సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,నాయకులు పి.సి.హన్మంత్ రెడ్డి,సింగం గంగాధర్,భాస్కర్,ఎం.డి.యాకూబ్,దేవేందర్ రావు,పబ్బా శివానందం,రాజ్ మోహన్,సతీష్ రాజ్,మానాల కిషన్,సత్యనారాయణ,పురుషోత్తమ రావ్,కన్నపూర్ సుధాకర్,పుప్పాల నర్సింగా రావు,బొబ్బటి కరుణ,విజయ లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *