
కడపలో బయిటకు వస్తున్న రియల్ అక్రమాలు…
సిరా న్యూస్,కడప; : కడప జిల్లాల్లో వైసీపీ నేతల రియల్ అక్రమాలకు సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా లే అవుట్లు వేసి మౌళిక వసతులు కూడా కల్పించడంతో పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అక్రమార్కులు ప్రతి లేఅవుట్లో ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకుని వ్యాపారం చేశారని కమిటీ తనిఖీల్లో బయటపడుతోంది. దాంతో విచారణకు వచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయా లేఔట్లలో ప్లాట్లు కొన్న అమాయకులకు న్యాయం జరుగుతుందా? అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ఐదేళ్ల జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా కంటే బాధితుల లిస్టే పెద్దగా కనిపిస్తుంది. కడప జిల్లాలో కొందరు వైసీపీ నేతలు రియల్టర్ల అవతారమెత్తి నిబంధనలకు వ్యతిరేకంగా లేఅవుట్లు వేసి స్థలాలను మధ్యతరగతి, పేదలకు…
