కర్నూలులో రియల్ జై భీమ్….

సిరా న్యూస్,కర్నూలు;
: క‌ర్నూలు జిల్లాలో పోలీసుల చ‌ర్యపై సర్వత్రా విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైభీమ్ సినిమా త‌ర‌హాలో క‌ర్నూలులో పోలీసులు చ‌ర్యలు ఉన్నాయి. విచార‌ణ పేరుతో తీసుకెళ్లి ఎవ‌రికీ తెలియ‌కుండా గోప్యంగా ఉంచారు. అంతేకాకుండా చిత్ర హింస‌లకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయ‌వాదులు జోక్యంతో బాధితుడు విడుద‌ల అయ్యారు.కర్నూలు త్రీ టౌన్ లో పోలీసుల అత్యుత్సాహం ప్రద‌ర్శించారు. దొంగ‌త‌నం చేశార‌నే నెపంతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని 18 రోజుల పాటు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్‌లోనే నిర్బంధించారు. ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి పోలీసులు జె.మహేష్‌, ఆయ‌న బావ వై.బాలకృష్ణను విచారణ పేరుతో తీసుకువెళ్లారు. బాధితుల తరఫున పిటిషన్ వేసిన మహేష్ భార్య జె. మాధవి 13వ తేదీన పోలీసులను కలిసినప్పటికీ, వారు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు.కర్నూలు త్రీ టౌన్‌లో పోలీస్ స్టేష‌న్‌లో జై భీమ్ సినిమా తరహాలో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. 18 రోజుల నుంచి అనుమానితులను బలవంతంగా బంధించారని, చిత్ర హింసలకు గురి చేశారంటూ బాధితుల బంధువుల ఆరోపించారు. 18 రోజులుగా తమ పిల్లలు కనపడడం లేదంటూ న్యాయ‌వాదుల‌ను ఆశ్రయించటంతో ఈ ఘటన వెలుగులోకి వ‌చ్చింది.జడ్జి సెర్చ్‌ వారెంట్ విధించడంతో అడ్వకేట్ క‌మిష‌న‌ర్‌గా మాలిక్ బాషాను నియ‌మించి, ఆయ‌న‌ ఆధ్వర్యంలో నేరుగా కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లోకి ప్రవేశించి అనుమానితుల స్టేట్మెంట్ రికార్డు చేసి జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. సీఐ మురళీధర్ రెడ్డిపై గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అమాయకులను, అనుమానితులను, నిందితులగా బలవంతంగా కేసులు పెడుతున్నారని ఆరోపణ‌లు ఉన్నాయి.కర్నూలు త్రీ టౌన్ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు ఉన్నతాధికారులను కోరారు. నేరం చేసిన ఏ ముద్దాయినైనా 24 గంటల్లోపు జడ్జి ముందు ప్రవేశపెట్టాల‌ని, ఇక్కడ 18 రోజులు గడిచిన పోలీసులు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేద‌ని అన్నారు. కర్నూలు త్రీ టౌన్ పోలీసులు తీరుపై అడ్వకేట్లు, ప్రజా సంఘాలు నేత‌లు మండిపడుతున్నారు. వారిని విడుదల చేయాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని బాధితురాలి ఆరోపించారు.న్యాయ‌వాదులు మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులను చేయ‌ని నేరానికి పోలీసులు అక్రమంగా నిర్బంధించార‌ని, వారిని వేర్వేరు చోట్లకు మార్చుతున్నార‌ని తెలిపారు. నిబంధ‌న‌ల ప్రకారం అరెస్టు చేసిన 24 గంట‌ల్లోపు, స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని, కానీ 18 రోజులు కావ‌స్తున్నా, మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌లేద‌ని అన్నారు. వారిని నిర్బంధించి చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నార‌ని తెలిపారు. న్యాయ‌వాదులు వెళ్లి మాట్లాడిన‌ప్పటికీ, సీఐ ఇది నా స్టేష‌న్ నా ఇష్టం అన్నట్లు ప్రవ‌ర్తిస్తున్నార‌ని విమ‌ర్శించారు.జె.మహేష్‌, ఆయ‌న బావ వై.బాలకృష్ణను విడుద‌ల చేయాల‌ని తాము మేజిస్ట్రేట్ ముందు దావా వేశామ‌ని, అప్పుడు మేజిస్ట్రేట్ సెర్చ్ వారెంట్ ఇవ్వడంతో అడ్వొకేట్ క‌మిష‌న్‌తో పాటు తాము కూడా సోమవారం రాత్రి పోలీస్ స్టేష‌న్‌లో సెర్చ్ చేశామ‌ని, అప్పుడు వారిని అక్కడ గుర్తించామ‌ని తెలిపారు. వారిని కోర్టులో ప్రవేశ‌పెట్టేందుకు తాము అడిగితే అప్పుడు సీఐ అనుమతి ఇచ్చార‌ని వివ‌రించారు. అడ్వొకేట్ క‌మిష‌న‌ర్ మాలిక్ బాషా మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేర‌కు బాధితులను కుటుంబ స‌భ్యుల‌కు అప్పగిస్తామ‌ని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *