ఆంధ్రప్రదేశ్

రెడ్ బుక్ ఓపెన్,…

సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరు ప్రముఖంగా వినిపించింది. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు,మంత్రులతో పాటు వత్తాసు పలికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిపై చర్యలు ఖాయమని ఎన్నికలకు ముందే ప్రకటించారు లోకేష్. అప్పట్లో అధికారపక్షంగా ఉన్న వైసిపి దీనిని తేలిగ్గా తీసుకుంది. అసలు అధికారంలోకి రాకముందే ఈ రెడ్ బుక్ రాతలు ఏమిటని ప్రశ్నించింది.లోకేష్ కు అంత సీన్ లేదని ఎగతాళి చేసింది.కానీ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. నారా లోకేష్ మంత్రి అయ్యారు. అప్పట్లో అతిగా వ్యవహరించిన వైసీపీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఉన్నతాధికారులపై సస్పెన్షన్ల వేటు కొనసాగుతోంది.…

Read More
28 Sep 2024, 1:41 pmsiranews.in