
అమెరికాలో తగ్గిన కొలువులు..
సిరా న్యూస్,న్యూఢిల్లీ; డిగ్రీవరకు భారత్‌లో చదివి.. ఉన్నత చదువుల అబ్రాడ్‌లో చదవాలి.. మత పిల్లలు జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడాలి.. ఇదీ నేటితరం తల్లిదండ్రుల ఆలోచన. ఇక చదివితే అబ్రాడ్‌లోనే చదవాలి.. అక్కడే కొలువు కొట్టాలి. అక్కడే స్థిరపడాలి. అక్కడి సొమ్ముతో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలి. ఇదీ నేటితరం యువతరం ఆలోచన. దీనిని నెరవేర్చుకునేందుకు యువత చాలా కష్టపడుతోంది. ఇక తల్లిదండ్రుల కూడా పిల్లల డాలర్ డ్రీమ్ నెరవేర్చేందుకు ఆదాయం కూడబెడుతున్నారు. అప్పో సప్పో చేసి ఉన్నత చదువులు చదివిపిస్తున్నారు. అన్నీ కుదిరితే అబ్రాడ్‌కు పంపుతున్నారు. కరోనా ముందు వరకు అబ్రాడ్ చదువులు బాగానే సాగాయి. చదువు పేరుతో వెళ్తున్న చాలా మంది అక్కడ చదువుతూనే సంపాదించడం అలవాటు చేసుకుంటున్నారు. ఇక్కడ చిన్నచిన్న పనులు చేయడానికి మొహమాటపడేవారు. అక్కడ షాప్ కీపర్లుగా, పెట్రోల్ బంకుల్లో, డెలివరీ బాయిస్‌గా పనిచేస్తున్నారు.…
