
బండి చొరవతో అయ్యప్పభక్తులకు ఊరట
సిరా న్యూస్,హైదరాబాద్; శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా అకస్మాత్తుగా సర్వీస్ రద్దు చేయడంతో శబరిమలకు వెళ్లాల్సిన 60 మందికి పైగా అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. మధ్యాహ్నం వెళ్లాల్సిన విమానం రద్దు అయితే ఇప్పటివరకూ ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదని ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. మరో విమానం ఎప్పుడొస్తుంది, ప్రత్నామ్నాయంగా ఏం ఏర్పాట్లు చేస్తున్నారో కూడా ఎయిర్ ఇండియా చెప్పక పోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన చెందుతున్నారు.కుత్బుల్లాపూర్ కు చెందిన 63 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకుగానూ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత ఎయిర్ ఇండియా విమానం బయలుదేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో ఎయిరిండియా ఆ సర్వీసును రద్దు…
