ఆంధ్రప్రదేశ్

రాజీనామాలు సరే… చేరెదెప్పుడు

సిరా న్యూస్,ఏలూరు; వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కొందరు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవితో పాటు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే పార్టీలో ఇంత వరకూ చేరలేదు. వైసీపీ నుంచి పోతుల సునీతతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. రాజీనామా చేసి పది రోజులు దాటుతున్నా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోలేదు. అందుకు అనేక కారణాలున్నాయని చెబుతున్నారు.బీద మస్తాన్‌రావు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పోతుల సునీత విషయంలో మాత్రం స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ క్యాడర్ పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోతుల…

Read More
9 Sep 2024, 11:54 amsiranews.in