
14 సీట్ల కోసం 14 నుంచి రేవంత్ ప్రచారం
సిరా న్యూస్,హైదరాబాద్; పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే ముందుగానే..ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగతున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్‌లో పడేసేలా…ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు రేవంత్ రెడ్డి.వచ్చే నెల 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ నెల 14 నుంచి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు సీఎం రేవంత్. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మూడుకు తగ్గకుండా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్‌లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు సీఎం రేవంత్.ఇప్పడికే ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్, బీజేపీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో…
