
హరీష్ రావు ట్రాప్ లో రేవంత్…
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో అధికారం కోల్పోయాక రాష్ట్రంలో పార్టీ అధినేత కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు తేలిపోతున్నాయి. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. వారిని కట్టడి చేయడంలోనూ త్రిమూర్తులు(కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ) విఫలమవుతున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా, బూమరాంగ్ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్‌కే ఫేవర్‌గా మారుతున్నాయి.వ్యూహాలు విఫలమవుతున్నా.. ఎత్తుగడలు చిత్వతున్నా.. అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మానడం లేదు. అదే జరిగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని గులాబీ నేతలకు తెలుసు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి విసిరిన ఓ సవాల్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు బలం తెచ్చింది. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని, అప్పుడు హరీశ్‌రావు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. దీనికి హరీశ్‌రావు తగ్గేతే లేదంటూ ముందుకు వచ్చారు. రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, అలా…
