Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 25 December 2023, 5:31 pmEditor : Sira News
కాటేదాన్ లో రోడ్డు ప్రమాదం

సిరా న్యూస్,రంగారెడ్డి;
హైదరాబాద్ నగర శివారు కాటేదాన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఢి వైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టింది. ఘటనలో కారు లో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుండి డబిరిపూరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించ బోయి కారు ప్రమాదానికి గురైందని సమాచారం.
