Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 14 January 2024, 6:23 pmEditor : SIRA NEWS
Road Accident, Retd. Teacher Died: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉపాద్యాయుడి మృతి

సిరా న్యూస్, దస్తురాబాద్:
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉపాద్యాయుడి మృతి
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని భూత్కూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయుడు అడ్డగూరి ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం… ప్రభాకర్ ఆదివారం ఉదయం తన కారులో వెళ్తుండగా గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఢీకొన్నాడు. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన జగిత్యాలకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
